సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (13:56 IST)

మధ్యప్రదేశ్‌లో 8.22 క్యారెట్ల వజ్రం లభ్యం.. విలువ రూ.40లక్షలు

మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలో వజ్రాల వేట కొనసాగిస్తున్న నలుగురు కార్మికులకు సుమారు 8.22 క్యారెట్ల వజ్రం లభ్యమైంది. దాని విలువ మార్కెట్‌లో సుమారు 40 లక్షలు ఉంటుంది. దాదాపు 15 ఏళ్ల నుంచి ఆ నలుగురూ వజ్రాల కోసం అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. పన్నా జిల్లాలోని హిరాపూర్ తపరియాన్‌లో ఉన్న లీజు భూమిలో రతన్‌లాల్ ప్రజాపతితో పాటు ఇతరులకు ఆ డైమండ్ దొరికినట్లు కలెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రా తెలిపారు. 
 
వజ్రాన్ని వేలం వేసిన తర్వాత వచ్చే సొమ్మును ఆ నలుగురికి పంచి ఇవ్వనున్నారు. సెప్టెంబర్ 21వ తేదీ నుంచి వజ్రాలను వేలం వేయనున్నారు. వజ్రం అమ్మితే వచ్చే డబ్బుతో పిల్లలకు మంచి చదువు చెప్పించనున్నట్లు రఘువీర్ ప్రజాపతి తెలిపారు. భోపాల్‌కు 380 కిలోమీటర్ల దూరంలో ఉన్న పన్నా జిల్లాలో సుమారు 12 లక్షల క్యారెట్ల వజ్రాలు ఉండి ఉంటాయని భావిస్తున్నారు.