శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (09:36 IST)

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం : 16 మంది మృత్యువాత

వాతపడ్డారు. తాజా సమాచారం మేరకు యావల్ తాలూకాలోని కిగాంవ్‌ సమీపంలో కూలీలతో వెళుతున్న ఒక ట్రక్కు బోల్తా పడింది. రాజీజోన్ గ్రామంలోని ఒక ఆలయం సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 16 మంది మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. ఒక ట్రక్కు బోల్తా పడిన ఘటనలో 16 మంది అక్కడికక్కడే మృతి చెందినట్టు చెప్పారు. మృతులంతా అభోదా, కర్హలా, రావేరా జిల్లాలకు చెందిన కూలీలుగా గుర్తించారు.