మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 23 మే 2021 (17:33 IST)

ఐఎస్ఐతో లింకులు.. ఇండోర్‌లో అక్కాచెళ్లెళ్లు అరెస్టు

పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐతో సంబంధాలు కలిగివున్నాయన్న కారణంగా మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలోని ఇండోర్‌కు చెందిన ఇద్ద‌రు అక్కాచెళ్లెల్ల‌ను పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై లీసులు, మిలిటరీ ఇంటెలిజెన్స్ ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. 
 
వీరిద్దరూ పాకిస్థాన్ గూఢచార సంస్థతో సంబంధాలు కలిగివున్నాయని రుజువు చేసే ఆధారాలను కూడా పోలీసులు సేకరించినట్టు సమాచారం. 32 ఏళ్లు, 28 సంవత్సరాల వయస్సు గల ఈ అక్కాచెళ్లెల్లు ఇండోర్ సమీపంలో ఉన్న డాక్టర్ అంబేద్కర్ నగర్‌లో ఉన్న పాఠశాల ఉపాధ్యాయులుగా పనిచేస్తుండటం గమనార్హం. 
 
నకిలీ గుర్తింపుల ద్వారా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై పాకిస్థాన్‌కు చెందిన వ్య‌క్తుల‌తో ఏడాది కాలంగా కాంటాక్ట్‌లో ఉన్న‌ట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. వారి సెల్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి.