శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 సెప్టెంబరు 2020 (17:19 IST)

పిల్లి ఎంత పని చేసిందబ్బా... రెండేళ్ళ చిన్నారి మృతి!

ఓ నల్లపిల్లి చేసిన పనికి రెండేళ్ళ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. పిల్లి రూపంలో మృత్యువు రావడంతో రెండేళ్ళ చిన్నారి చనిపోయిన విషాదకర సంఘటన తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చెన్నై అయనావరం ప్రాంతంలో నివసిస్తున్న దంపతులు శనివారం సాయంత్రం తమ చిన్నారిని టీవీ టేబుల్‌ పక్కన పడుకోబెట్టి పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో ఇంట్లోకి దూరిన పిల్లి టీవీని నెట్టేయడంతో పాప తలపై పడి తీవ్రంగా గాయపడింది. 
 
తల్లిదండ్రులు హుటాహుటిన స్థానిక కీల్పాక్ ప్రభుత్వ హాస్పిటల్‌గా తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అంతసేపూ తమ కళ్ల ముందే అల్లారుముద్దుగా ఆడుకున్నపాప మృతి చెందిందన్న విషయాన్ని జీర్ణించుకోలేని ఆ తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.