శనివారం, 21 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 23 సెప్టెంబరు 2021 (13:07 IST)

20 వీధికుక్కలను విషం పెట్టి చంపాడు.. మిఠాయిషాపు ఓనర్ అరెస్ట్

ఒడిశాలోని కటక్‌ జిల్లాలో 20 వీధి కుక్కలకు విషం పెట్టి చంపిన ఓ మిఠాయి దుకాణాదారుడ్ని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. దుకాణంలో సమీపంలో ఐదు రోజులుగా వీధికుక్కలు మొరగడంతో పాటు చిందర వందర చేయడాన్ని తట్టుకోలేక .. వాటికి విషం పెట్టినట్లు పోలీసులు చెబుతున్నారు.
 
చనిపోయిన శునకాలను సమీపంలోని గోతిలో పడేయడాన్ని స్థానికులు గుర్తించడంతో ఈ విషయం వెలుగుచూసింది. తంగి-చౌడ్‌వార్‌ బ్లాక్‌లోని శంకర్‌పూర్‌ గ్రామ మార్కెట్‌ చుట్టూ మరికొన్ని కళేబరాలను గుర్తించారు.
 
శునకాలు రాత్రంగా ఒకటే మొరగడంతో పాటు షాప్‌ వద్ద చిందవందర సృష్టిస్తున్నాయనే ఉద్దేశంతో తానే విషం పెట్టి చంపినట్లు నిందితుడు అంగీకరించాడని పోలీసులు చెప్పారు. నిందితుడిపై ఐపిసి.. జంతువుల పట్ల హింస నిరోధకచట్టం కింద కేసు నమోదు చేశామని తెలిపారు.