మహిళపై 23 గ్యాంగ్ రేప్.. రోడ్డుపై నిలబడితే కిడ్నాప్ చేసి...

శుక్రవారం, 29 సెప్టెంబరు 2017 (09:15 IST)

rape victim

రాజస్థాన్‌లోని బికనేర్‌లో ఓ మహిళపై 23 మంది కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 25న తన సొంత స్థలాన్ని చూసుకునేందుకు బికనేర్‌‌లోని రిడ్‌ మల్సర్‌ పురోహిటన్‌‌కు బాధిత మహిళ వెళ్లింది. ఆ స్థలాన్ని చూసుకుని తిరిగొస్తూ.. ఇంటికెళ్లేందుకు మధ్యాహ్నం పూట జైపూర్‌ రోడ్డులో ఖటూశ్యాంమందిర్‌ సమీపంలో వాహనాల కోసం వేచి చూస్తుండగా, ఎస్యూవీ వాహనంలో వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమెను బలవంతంగా తమ వాహనంలోకి లాగేశారు. 
 
అక్కడికి సమీపంలోని గనుల ప్రాంతంలోకి కారుని తీసుకెళ్లి వారిద్దరూ పలుమార్లు ఆమెపై అత్యాచారం చేశారు. ఆపై మరో ఆరుగురు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారని.. పలన అనే గ్రామంలోని విద్యుత్ సబ్ స్టేషన్ వద్దకు తీసుకెళ్లి అక్కడ కూడా తనపై అత్యాచారం జరిగిందని.. మరుసటి రోజు ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో ఎత్తుకెళ్లిన చోటనే వదిలి వెళ్లిపోయారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాధితురాలు తెలిపిన ప్రాంతంలో కండోమ్‌లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ దారుణానికి తెరతీసిన నిందితులను రాజు, సుభాష్‌గా గుర్తించామని, బాధితురాలికి వైద్య పరీక్షల చేయించినట్లు.. నివేదిక కోసం ఎదురచూస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

సెప్టెంబరు 30, అంతర్జాతీయ అనువాదకుల దినోత్సవం... క్విజ్‌లో పాల్గొనండి...

అనువాదం అనేది అతి ముఖ్యమైనది. ప్రపంచంలోని దేశాలన్నీ ఒకరికొకరు అర్థం చేసుకునేందుకు ...

news

చిరంజీవి, పవన్ కల్యాణ్ పేరుతో పార్కు.. ఏర్పడిన వివాదం.. ఘర్షణ

మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ల పేర్లు పార్కు వివాదంతో చిక్కుకున్నాయి. ...

news

దసరా వేళ.. ముంబైలో విషాదం.. ఎల్ఫిన్ స్టోన్ స్టేషన్ వద్ద తొక్కిసలాట.. 15 మంది మృతి

దేశ వాణిజ్య నగరం ముంబైని భారీ వర్షాలు ముంచెత్తిన నేపథ్యంలో తాజాగా ముంబైలోని ఎల్ఫిన్ ...

news

ఆర్టీసీ బస్సులో కానిస్టేబుల్-కండక్టర్‌ల ఫైట్: టిక్కెట్ తీసుకోనంది.. చేజేసుకుంది (వీడియో)

ఆర్టీసీ బస్సులో మహిళా కానిస్టేబుల్, కండక్టర్‌ల మధ్య ఫైట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ ...