శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 24 మే 2019 (20:19 IST)

సౌత్ ఢిల్లీలో మహిళపై గ్యాంగ్ రేప్...

దక్షిణ ఢిల్లీలో 26 యేళ్ల మహిళ ఒకరు సామూహిక అత్యాచారానికి గురైంది. ఈ ఘటన సౌత్ ఢిల్లీలోని మైదాన్ గర్హి ఏరియాలో జరిగింది. లిఫ్టు పేరుతో ఓ మహిళను ఎక్కించుకున్న కారు డ్రైవర్ ఒకరు తన స్నేహితులతో ఈ దారుణానికి పాల్పడ్డారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ నెల 18వ తేదీన రాత్రి 8 గంటల సమయంలో ఫతేపూర్‌ బేరిలో ఉన్న స్వామి సత్సంగ్ ఆశ్రమానికి బాధితురాలు ఒంటరిగా బయలుదేరింది. ఈమె రోడ్డులో ఆటో రిక్షా కోసం వేచివుండగా, ఓ కారు ఆమె ముందుకు వచ్చి ఆగింది. దీంతో ఆమె ఛత్తర్‌పూర్ వెళ్లేందుకు లిఫ్టు అడగ్గా ట్యాక్సీ డ్రైవర్ ఎక్కించుకున్నాడు. 
 
ఆ తర్వాత ఆ తర్వాత రూటు మార్చి.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత బాధితురాలు అక్కడ నుంచి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. తనపై దేవేందర్, జైహిందా అనే ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేసినట్టు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.