Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

యూపీలో ఘోరం.. ఆక్సిజన్ అందక 30 మంది పసికందుల మృతి.. సీఎం అత్యవసర భేటీ

శనివారం, 12 ఆగస్టు 2017 (10:14 IST)

Widgets Magazine
Gorakhpur Hospital

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఘోరం జరిగింది. ఆక్సిజన్ అందక 30 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. అదీకూడా ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ తనిఖీ చేసిన రెండు రెండు రోజుల్లోనే ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
యూపీలోని గోరఖ్‌పూర్‌ పట్టణంలో బాబా భార్గవ్‌ దాస్‌ ఆస్పత్రి (బీఆర్డీ) ఉంది. ఇక్కడ అనేక మంది చిన్నారుల చికిత్స పొందుతున్నారు. అయితే, గడచిన 48 గంటల వ్యవధిలో 30మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. బీఆర్డీ ఆస్పత్రిలో వైద్యసేవలపై పలు ఫిర్యాదులు రావడం, అక్కడ పెద్ద ఎత్తున చిన్నారుల మరణాలు సంభవిస్తుండటంతో సోమవారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ ఆస్పత్రిని సందర్శించారు.
 
రోగులకు అందుతున్న వైద్యసేవలను అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు. ఆయన వచ్చివెళ్లిన రెండు రోజులకే ఆస్పత్రిలో ఈ దారుణం చోటుచేసుకోవడం గమనార్హం. ఎన్‌సిఫలిటి‌స్‌తో బాధపడుతున్న పిల్లల వార్డు సహా మూడు వార్డుల్లో గురువారం 20మంది చనిపోగా.. శుక్రవారం సాయంత్రానికి మరో 10మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
ఇదిలావుండగా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శనివారం అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. గోరఖ్‌‌పూర్‌లోని బాబా రాఘవ్ దాస్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందించని కారణంగా 30 మంది చిన్నారులు మృతి చెందిన సంగతి తెలిసిందే. రోగుల సమస్యలపై ఆయన ఈ ఆస్పత్రిని సందర్శించి వెళ్లిన రెండు రోజుల్లోనే ఈ ఘోరం జరగడంతో యోగి సీరియస్‌గా తీసుకున్నట్టు కనిపిస్తోంది.
 
శనివారం ముఖ్యమంత్రితో సమావేశం అయిన తర్వాత యూపీ ఆరోగ్యమంత్రి సిద్దార్థ్ నాథ్ సింగ్, మెడికల్ విద్య మంత్రి అశుతోష్ టాండన్‌ ఇద్దరూ గోరఖ్‌పూర్ ఆస్పత్రికి వెళ్లనున్నారు. కాగా శనివారం ఉదయం ఆక్సిజన్ అందని కారణంగా మరో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఆక్సిజన్ అందని కారణంగా పిల్లలకు ఎన్సిఫలిటిస్ సోకినట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మెదడుపై అత్యంత వేగంగా ప్రభావం చూపే ఈ వ్యాధి కారణంగానే ఒక్కరోజులో 30 మంది పిల్లలు బలయ్యారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

హైదరాబాద్ వీధుల్లో కోటీశ్వర 'బిచ్చగాడు' అజ్ఞాతవాసం! ఎందుకు?

మహాభారతంలో పంచపాండవులు జూదంలో ఓడిపోయి అజ్ఞాతవాసం గడుపుతారు. అలాగే, 'బిచ్చగాడు' చిత్రంలో ...

news

ఏపీ శాసనసభలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు

అమరావతి : శాసనసభలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర రాజధాని ...

news

అక్క మొగుడు అత్యాచారం చేశాడు.. బిడ్డకు జన్మనిచ్చిన బాలిక.. ఉరేసుకుని ఆత్మహత్య..

అక్క మొగుడు చేసిన అఘాయిత్యానికి ఓ మరదలు నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది. మహిళలపై ...

news

8 నెలల చిన్నారిని ఫ్రిజ్‌లో పెట్టారు... ఎక్కడ (Video)

ప్రపంచవ్యాప్తంగా చిన్నారులపై జరుగుతున్న దాష్టీకాలు నానాటికీ ఎక్కువైపోతున్నాయి. తాజాగా ...

Widgets Magazine