1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr

ప్రాణం పోతున్నా.. పక్కనున్న వాళ్లు పట్టించుకోలేదు.. డబ్బుకోసం ఎగబడ్డారు...

దేశంలో పెద్ద నోట్ల రద్దు అనేక మంది ప్రాణాలను హరిస్తోంది. పైగా మానవత్వం మంటగలిసిపోయిన దృశ్యాలు పలుచోట్ల కనిపిస్తున్నాయి. అప్పటివరకు తమతోపాటు వరుస క్రమంలో నిల్చొన్న వ్యక్తి కుప్పకూలి ప్రాణంపోతున్నా.. పక

దేశంలో పెద్ద నోట్ల రద్దు అనేక మంది ప్రాణాలను హరిస్తోంది. పైగా మానవత్వం మంటగలిసిపోయిన దృశ్యాలు పలుచోట్ల కనిపిస్తున్నాయి. అప్పటివరకు తమతోపాటు వరుస క్రమంలో నిల్చొన్న వ్యక్తి కుప్పకూలి ప్రాణంపోతున్నా.. పక్కవాళ్లు చూసీచూడనట్టుగా ముందుకు జరిగి డబ్బు కోసం ఎగబడుతున్నారు. ఇలాంటి అమానవీయ సంఘటనలు అనేకం జరుగుతున్నాయి. 
 
పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీలో ఏటీఎం క్యూ లైన్లో నిలుచున్న ఓ 52 ఏళ్ల వ్యక్తి అక్కడే కుప్పకూలాడు. చాలా సమయం లైన్లో నిలుచున్న అతడికి ఒక్కసారిగా గుండెపోటు రావడంతో మృతి చెందాడు. బాధతో విలవిలలాడుతున్నా అతడితో పాటు లైన్లో ఉన్నవాళ్లు చూసీచూడనట్లుగా వదిలేసి.. డబ్బుకోసం ముందుకు కదిలారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
 
ఎక్కడ చూసినా మూసివేసిన, నో క్యాష్ బోర్డులు ఉంచిన ఏటీఎంలే కనిపిస్తున్నాయి. డబ్బు ఉన్న కొద్దిపాటి ఏటీఎంల వద్ద క్యూ లైన్లలో వృద్ధులు, మహిళలు నానా అవస్థలు పడుతున్నారు. దేశ వ్యాప్తంగా ప్రజలు బ్యాంకులు, ఏటీఎంల ముందు బారులు తీరుతున్నారు. 
 
సాధారణ అవసరాలకు సైతం చేతిలో డబ్బు అందుబాటులో లేకపోవడంతో సామాన్యుల సమయం గంటల కొద్ది క్యూ లైన్లలోనే గడుపుతున్నారు. కానీ, బ్యాంకు అధికారులు మాత్రం 80 శాతం ఏటీఎంలలో కొత్త నోట్లు ఉంచడానికి అవసరమైన మార్పులు చేశాం అని అధికారులు చెబుతున్నప్పటికీ కరెన్సీ కష్టాలు మాత్రం తీరడం లేదు.