శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 18 డిశెంబరు 2023 (11:56 IST)

దేశంలో మళ్ళీ నమోదవుతున్న కరోనా కేసులు - ఆదివారం 355 కేసులు

covid
దేశంలో కొత్తగా కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయి. దీనికి నిదర్శనమే ఆదివారం కొత్తగా 355 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదేసమయంలో కేరళ రాష్ట్రంలో కరోనా వైరస్ బారినపడిన బాధితుల్లో నలుగురు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒకరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. ఈ కొత్త కేసులతో కలుపుకుని దేశవ్యాప్తంగా మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1071కు చేరిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 
 
కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన లెక్కల ప్రకారం దేశంలో మొత్తం 4.50 కరోనా కేసులు వెలుగు చూశాయి. 4.46 కోట్ల మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో జాతీయ సగటు రికవరీ రేటు 98.81 శాతంగా నమోదైంది. కోవిడ్ మరణాల సంఖ్య 5,33,316కు చేరింది. అంతేకాకుండా, ఇప్పటివరకు 220.67 కోట్ల కోవిడ్ టీకాల డోసులను పంపిణీ చేశారు. 
 
ఇదిలావుంటే, దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే కేరళ రాష్ట్రంలోనే అత్యధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. పైగా, ఇది కొత్త కరోనా సబ్ వేరియంట్ జేఎన్.1గా గుర్తించారు. సార్స్ కోవ్-2 జీనోమిక్స్ కన్సార్షియమ్ జరుపుతున్న అధ్యయనంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కన్సార్షియం జరిపిన జీనోమిక్ పరీక్షల్లో 79 యేళ్ల మహిల జేఎన్ 1 సబ్ వేరియంట్ బారినపడినట్టు తేలింది.