ఉపాధి కోసం వెళ్లారు.. ఐఎస్‌లో చేరారు.. ఆపై తిరిగిరాని లోకాలకు...
సోమవారం, 3 జులై 2017 (06:31 IST)
అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్)లో పని చేస్తున్న ఐదుగురు కేరళ వాసుల చనిపోయారు. సిరియాలోని ఐఎస్ ఉగ్రవాద శిబిరాలపై అమెరికా సైన్యం జరిపిన దాడుల్లో వారు హతమయ్యారు. ఈ మేరకు కేరళ ఇంటెలిజెన్స్ విభాగానికి సమాచారం అందింది.
ఉపాధి కోసం బహ్రెయిన్ వెళ్లి ఆపై ఐఎస్ వైపు ఆకర్షితుడైన సిబి అనే వ్యక్తి మరణించినట్లు బంధువులకు సమాచారం అందింది. ముహదిస్ అనే మరోవ్యక్తి సిరియాలోని అలెప్పోలో మరణించాడు. పాలక్కాడ్ జిల్లాకే చెందిన అబూ తాహిర్ కూడా అమెరికా సైనిక దాడుల్లో చనిపోయాడు. అలాగే, సిరియాలోనే మరో ఇద్దరు కేరళవాసులు మరణించారని ఇంటెలిజెన్స్ విభాగం వెల్లడించింది.
Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :
,
,
,