మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 27 ఏప్రియల్ 2020 (20:15 IST)

ఆంధ్రా - తమిళనాడు సరిహద్దుల్లో ఆరు అడుగుల గోడ

కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటాయి. అయినప్పటికీ కరోనా వైరస్ వ్యాప్తికి ఏమాత్రం అడ్డుకట్ట పడటం లేదు. ఈ నేపథ్యంలో తమిళనాడు - ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దుల్లో గోడ ఒకటి ప్రత్యక్షమైంది. 
 
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే చర్యల్లో భాగంగా ఇరు రాష్ట్రాల మధ్య రాకపోకలతో పాటు జనసంచారం పూర్తిగా అడ్డుకునేందుకు ఇరు రాష్ట్రాల అధికారులు, పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఇందులోభాగంగా, ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో రహదారులపై ఆరు అడుగుల గోడను నిర్మించారు. 
 
వేలూరు జిల్లాలో కరోనా వైరస్ జిల్లా కలెక్టర్ షణ్ముగం అనేక చర్యలు చేపడుతున్నారు. ఇందులోభాగంగా, ఈ గోడను స్థానికులు నిర్మించారు. వేలూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ సరిహద్దుకు అత్యంత కీలకమైన ప్రాంతంగా ఉందన్నారు.