మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 26 అక్టోబరు 2021 (07:56 IST)

ఎంపీలో కలకలం రేపుతున్న #AY4 వేరియంట్

దేశాన్ని కరోనా వైరస్ ఓ కుదుపు కుదిపింది. ఆ తర్వాత వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్ అలా వివిధ రకాల వేరియంట్లు కొత్తగా పుట్టుకొస్తాయి. దీంతో ఈ వేరియంట్లపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా ఏవై.4గా పిలుస్తున్న కరోనా వైరస్‌లోని కొత్త వేరియంట్ మధ్యప్రదేశ్‌లో కలకలం రేపుతోంది. 
 
ఇండోర్‌కు చెందిన ఆరుగురు వ్యక్తులు ఈ వేరియంట్ బారినపడ్డారు. వీరంతా వ్యాక్సినేషన్ పూర్తయిన వారే కావడం గమనార్హం. వీరందరికీ ఏవై.4 వేరియంట్ సోకిన విషయాన్ని దేశ రాజధానిలోని జాతీయ వ్యాధి నివారణ కేంద్రం నిర్ధారించింది.
 
ఈ వేరియంట్ జన్యు క్రమాన్ని పరిశీలించేందుకు బాధితుల నమూనాలను ప్రయోగశాలకు పంపించారు. చికిత్స అనంతరం బాధితులు కోలుకున్నట్టు మధ్యప్రదేశ్‌ వైద్య ఆరోగ్యశాఖ ప్రధానాధికారి బీఎస్ సాయిత్య తెలిపారు.