సరస్సులో పడవ బోల్తా-ఆరుగురు విద్యార్థులు మృతి  
                                       
                  
                  				  వడోదర సమీపంలోని సరస్సులో పడవ బోల్తా పడడంతో ఆరుగురు పాఠశాల విద్యార్థులు మృతి చెందారు. 
	ప్రమాద సమయంలో పడవలో ఉన్న వారి సంఖ్య 20 నుండి 30 మందికి పైగా ఉన్నట్లు సమాచారం. 
				  											
																													
									  
	 
	గుజరాత్‌లోని వడోదర సమీపంలోని సరస్సులో పడవ బోల్తా పడిన ఘటనలో ఆరుగురు పాఠశాల విద్యార్థులు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులు న్యూ సన్‌రైజ్ స్కూల్‌కు చెందినవారని.. టూర్ కోసం వచ్చి ప్రమాదానికి గురయ్యారని చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.