శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 27 సెప్టెంబరు 2018 (11:02 IST)

పంజాబ్- 65ఏళ్ల రిటైర్డ్ హెడ్ మాస్టర్‌ను పెళ్లాడిన 20 ఏళ్ల విద్యార్థిని

పంజాబ్‌లో 20 ఏళ్ల విద్యార్థినిని 65 ఏళ్ల హెడ్ మాస్టర్ వివాహం చేసుకోవడం సంచలనమైంది. వివరాల్లోకి వెళితే.. పంజాబ్ అబోకర్ ప్రాంతానికి చెందిన జయకృష్ణన్ (65) రిటైర్డ్ హెడ్ మాస్టర్. ఇతని భార్య మరణించిన నేపథ్

పంజాబ్‌లో 20 ఏళ్ల విద్యార్థినిని 65 ఏళ్ల హెడ్ మాస్టర్ వివాహం చేసుకోవడం సంచలనమైంది. వివరాల్లోకి వెళితే.. పంజాబ్ అబోకర్ ప్రాంతానికి చెందిన జయకృష్ణన్ (65) రిటైర్డ్ హెడ్ మాస్టర్. ఇతని భార్య మరణించిన నేపథ్యంలో.. వేరొక ఇంట్లో ఉంటూ ఒంటరి జీవనం సాగిస్తున్నాడు. ఇతని వద్ద అదే ప్రాంతానికి చెందిన మహత్ (20) అనే విద్యార్థిని ట్యూషన్ కోసం వచ్చి వెళ్తుండేది. దీంతో ఆ విద్యార్థిని హెడ్ మాస్టర్‌పై మనసు పారేసుకుంది. 
 
వీరిద్దరూ ప్రేమికులుగా మారిపోయారు. ఇటీవలే వీరిద్దరూ ఇంటి నుంచి జంప్ అయ్యారు. దీంతో మహత్ తల్లిదండ్రులు జయకృష్ణన్ తన కుమార్తెను కిడ్నాప్ చేసినట్లు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని వేర్వేరు ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో రామేశ్వరంలో జయకృష్ణన్, మహత్‌లు వున్నట్లు గుర్తించారు. 
 
పంజాబ్ పోలీసులతో పాటు మహత్ తల్లిదండ్రులు రామేశ్వరంలోని కూతురు వద్దకు వచ్చారు. ఆపై జయకృష్ణన్, మహత్‌ల వద్ద జరిపిన దర్యాప్తులో వారికి వివాహం అయినట్లు తెలిసింది. దీంతో మహత్ తల్లిదండ్రులు షాకయ్యారు. ఆపై మహత్, జయకృష్ణన్‌లు పంజాబ్‌కు బయల్దేరారు.