గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 12 మార్చి 2022 (11:04 IST)

హస్తినలో భారీ అగ్నిప్రమాదం - ఏడుగురి సజీవదహనం

దేశ రాజధాని ఢిల్లీలో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు సజీవదహనమయ్యారు. అలాగే, సుమారుగా వంద గుడిసెల వరకు కాలిపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపకదళ బృందం 13 ఫైరింజన్లతో మంటలను ఆర్పివేశాయి. 
 
ఢిల్లీలోని గోకుల్‌పురి ఏరియాలో ఈ ప్రమాదం సంభవించింది. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు విశ్వప్రయత్నం చేయాల్సివచ్చింది. మరోవైపు, ఈ ప్రమాదంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాద స్థలాన్ని సందర్శిస్తానని, అగ్నిప్రమాద బాధితులతో వ్యక్తిగతంగా మాట్లాడుతానని చెప్పారు.