సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 23 మే 2023 (16:33 IST)

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం- ఏడుగురు మృతి

road accident
మహారాష్ట్రలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. నాగ్‌పూర్-పూణె హైవేపై ప్రయాణికులతో వెళ్తున్న బస్సు, ట్రక్కును ఢీకొట్టింది. బుల్ధానా ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. 
 
బస్సు మెహ్‌కర్ నుంచి పూణే వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రెండు వేరేవేరు దిశల్లో వస్తుండగా ట్రక్కు, బస్సు ఎదురెదుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.