శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 28 మార్చి 2022 (18:46 IST)

బీహార్‌లో బాంబు పేలుడు-ఏడుగురికి గాయాలు

బీహార్‌లో సోమవారం బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురికి స్వల్ప గాయాలయ్యాయి. తక్కువ తీవ్రతో కూడిన పేలుడు కావడంతో పెను ప్రమాదం తప్పింది. బీహార్‌లోని లఖిసరాయ్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ఆ జిల్లా ఎస్పీ సుశీల్ కుమార్ ధృవీకరించారు.
 
బాంబును ప్లాస్టిక్ సంచిలో ఉంచారు.. దానిని లుటన్ రజక్ అనే వ్యక్తికి చెందిన ఇంటి పెరట్లో పెట్టారు. ఆ కుటుంబానికి చెందిన మైనర్ బాలుడు ప్లాస్టిక్ బ్యాగ్ తెరిచిన వెంటనే పేలుడు సంభవించింది. 
 
బాంబు తీవ్రత తక్కువగా ఉంది. మొత్తం ఏడుగురికి గాయాలు అయ్యాయి. గాయపడినవారికి పిపారియా ఆరోగ్య కేంద్రంలో ప్రాథమిక చికిత్స అందించారని ఎస్పీ సుశీల్ కుమార్ తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న తర్వాత పోలీసులు అక్కడికి చేరుకున్నట్టుగా ఎస్పీ సుశీల్ కుమార్ తెలిపారు.