గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 22 సెప్టెంబరు 2021 (14:49 IST)

హిమాచల్‌ప్రదేశ్‌: ఒకే స్కూల్‌లో 70మంది విద్యార్థులకు కరోనా

హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ జిల్లాలో ఒకే స్కూల్‌కు చెందిన 79 మంది విద్యార్థులకు కరోనా సోకింది. మండీ జిల్లాలోని ధరంపూర్ పట్టణంలోని రెసిడెన్షియల్‌ పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులు, 79 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో తేలింది. దీంతో అధికారులు వారందరని క్వారంటైన్‌కు తరలించారు. పాఠశాలను మైక్రో కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించారు.
 
తాజా కేసుల నేపథ్యంలో ఈనెల 25 వరకు పాఠశాలలను తెరవకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే గతంలో సెప్టెంబర్‌ 21 వరకు స్కూళ్లను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో మరో నాలుగురోజులపాటు బడులను మూసివేస్తున్నట్లు వెల్లడించింది. 
 
అయితే రెసిడెన్షియల్ స్కూళ్లను దీనినుంచి మినహాయించింది. పాఠశాలలను మూసివేసినప్పటికీ ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ ఉద్యోగులు మాత్రం విధులకు హాజరు కావాలని ప్రభుత్వం ఆదేశించింది. హిమాచల్‌ప్రదేశ్‌లో మంగళవారం 263 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో ఇద్దరు మృతిచెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 3639కి పెరిగింది.