ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 18 జూన్ 2021 (13:18 IST)

ఇద్దరి బాలికలపై అత్యాచారం, హత్య: పారిపోతున్న నిందితుడిపై కాల్పులు

ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మైనర్ బాలికలపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆ బాలికలిద్దర్నీ హత్య చేసి చెట్టుకు ఉరి తీసారు. వారిది ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసారు. ఈ ఘటన అస్సాంలో జరిగింది. ఘటనా స్థలంలో లభించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
 
ఓ బాలిక వయసు 14. మరో బాలిక వయసు 16 ఏళ్లు. ఈ ఇద్దరినీ కిడ్నాప్ చేసిన కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రధాన నిందితుడు 22 ఏళ్ల ఫరిజుల్ రెహ్మాన్ పోలీసుల అదుపులో నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. దాంతో అతడిపై కాల్పులు జరిపారు పోలీసులు. ఈ కాల్పుల్లో అతడి కాలికి తీవ్ర గాయమైంది. కాగా మిగతా ముగ్గురు నిందితులపై కుట్ర, సాక్ష్యాలను దాచడం వంటి అభియోగాలు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.