శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Modified: శుక్రవారం, 14 జూన్ 2019 (21:42 IST)

రైల్వే స్టేషనులో ప్రేయసీప్రియులు... అకస్మాత్తుగా కొబ్బరి బొండా కత్తితో ప్రేయిసిపై దాడి...

చెన్నై మహానగరంలోని చేత్‌పేట్ రైల్వే స్టేషనులో దారుణం జరిగింది. అప్పటివరకూ ఇద్దరూ ఒకే బెంచిపై కూర్చుని ఊసులాడుకుంటూ ఒక్కసారిగా గొడవపడ్డారు. వెంటనే ఆగ్రహంతో ప్రియుడు తన వెంట తెచ్చుకున్న కొబ్బరిబొండా కత్తితో ప్రేయసిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. యువతి కేకలు వేస్తూ ఫ్లాట్‌ఫాంపైన కుప్పకూలింది. ఆమెని హుటాహుటిని రాజీవ్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా వున్నట్లు వైద్యులు చెపుతున్నారు.
 
ఈ హఠత్పరిణామాన్ని గమనించిన తోటి స్టేషనులో వున్న ప్రయాణికులు దాడి చేస్తున్న యువకుడిని పట్టుకుని చితక బాదారు. ఇంతలో అటుగా రైలు వస్తుంటే ఆత్మహత్య చేసుకునేందుకు అతడు ప్రయత్నించగా దేహశుద్ధి చేసినవారు అతడి ప్రయత్నాన్ని అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. ఘటన స్థలంలో వున్న కత్తిని స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.