శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By preethi
Last Modified: శుక్రవారం, 5 అక్టోబరు 2018 (12:44 IST)

టాయిలెట్ గోడపై యువతి ఫోన్ నంబర్... ఫోన్ చేసి వెళ్లిన అతడికి?

ఒక గుర్తు తెలియని యువకుడు ఒక మహిళకు పదేపదే ఫోన్‌ చేసి విసిగిస్తూ, అసభ్యకరంగా మాట్లాడుతూ వేధింపులకు గురి చేశాడు.

మహిళలకు అన్ని రూపాల్లో దినదినం వేధింపులు ఎదురవుతూనే ఉన్నాయి. ఇప్పటి స్మార్ట్ ఫోన్ యుగంలో అవి మరీ ఎక్కువయ్యాయి. వీటిని అరికట్టడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నప్పటికీ, ఎన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఏదో ఒక రూపంలో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఇటీవల ఇలాంటి సంఘటనే ఒకటి నేలమంగళంలో జరిగింది. 
 
ఒక గుర్తు తెలియని యువకుడు ఒక మహిళకు పదేపదే ఫోన్‌ చేసి విసిగిస్తూ, అసభ్యకరంగా మాట్లాడుతూ వేధింపులకు గురి చేశాడు. యువకుడి వేధింపులు మితిమీరడంతో మనస్తాపానికి గురైన మహిళ తన కుటుంబ సభ్యులకు ఈ విషయం గురించి చెప్పింది. దీంతో పక్కా ప్రణాళిక వేసుకుని ఆ మహిళతోనే ఫోన్ చేయించి ఆ యువకుడిని రప్పించారు. ఇదేమీ తెలియకుండా యువకుడు వచ్చి అక్కడివారి చేతిలో ఇరుక్కున్నాడు. ఈ క్రమంలో ఆ యువకుడిని చెప్పులతో చితక్కొట్టారు.
 
ఇందులో కొసమెరుపేమిటంటే అసలు నీకు ఈ ఫోన్ నంబర్ ఎలా వచ్చిందని ఆ యువకుడిని ప్రశ్నించగా, టాయిలెట్ గోడపై ఈ నంబర్ కనిపించిందని, అందుకే కాల్ చేసానని తనను క్షమించాల్సిందిగా ఆ యువకుడు వేడుకున్నాడు.