సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (14:54 IST)

పదకొండేళ్ల బాలికను గర్భవతిని చేసిన ప్రిన్సిపల్: ఉరిశిక్ష విధించిన కోర్టు

విద్యాబుద్ధులు చెప్పి భావిపౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఆ ఉపాధ్యాయులు అభంశుభం తెలియని ఐదో తరగతి విద్యార్థినిపై తమ కామవాంఛను తీర్చుకున్నారు. ఫలితంగా ఆ బాలిక గర్భవతి అయ్యింది. కేసు విచారణ చేసిన కోర్టు సహకరించిన ఉపాధ్యాయుడికి జీవితఖైదును అత్యాచారం చేసిన కామాంధ ప్రిన్సిపల్‌కి ఉరి శిక్షను విధించింది.
 
పూర్తి వివరాల్లోకి వెళితే... బీహార్ రాష్ట్రంలోని పుల్వారీ షరీఫ్ ప్రాంతంలోని ఓ స్కూల్లో 11 ఏళ్ల బాలికి ఐదో తరగతి చదువుతోంది. ఆ బాలికపై పాఠశాల ప్రిన్సిపల్ కన్నేశాడు. ఎలాగైనా తనకు ఆ బాలికను అప్పగించాలని క్లాస్ టీచర్ ను కోరడంతో అతడు సహకరించాడు. దీనితో 2018 సెప్టెంబరులో బాలికపై ప్రిన్సిపల్ అత్యాచారం చేసాడు.
 
ఇంట్లో ఎవ్వరికీ చెప్పొద్దని బెదిరించడంతో బాలిక ఏమీ చెప్పలేదు. ఐతే కొన్నిరోజులు తర్వాత బాలిక తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆమెను వైద్యులకు చూపించారు. పరీక్షించిన డాక్టరు ఆమె గర్భవతి అనే తేల్చారు. విషయం ఏంటని బాలికను గట్టిగా నిలదీయడంతో జరిగినదంతా చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదుచేసి ఇరువరు ఉపాధ్యాయులను అరెస్ట్ చేసారు. ఈ కేసు అప్పట్నుంచి కోర్టులో విచారణ చేయగా నేడు తీర్పును వెలువరించింది. అత్యాచారం చేసిన ప్రిన్సిపల్ కి లక్ష రూపాయల జరిమానాతో పాటు మరణశిక్ష విధించింది. సహకరించిన ఉపాధ్యాయుడికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ. 50 వేలు జరిమానా విధించింది.