శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 24 జూన్ 2024 (13:03 IST)

కేరళ: రోడ్డుపై బురద.. జారి పడిన టూవీలరిస్ట్.. బస్సు చక్రాల కింద? (video)

Kerala
Kerala
కేరళలో ఓ యువకుడు పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. మొన్నటికి మొన్న నెల్లైలో ఆవుల కొట్లాటడంతో రోడ్డుపై వెళ్తున్న టూవీలరిస్ట్ ప్రాణాలు కోల్పోయాడు. బస్సు కింద పడి ఆ వ్యక్తి మృతి చెందాడు. 
 
అయితే తాజాగా కేరళలో ఓ యువకుడు ఇంచుమించు ఇదే ఘటనలో ప్రాణాలతో బయటపడ్డాడు. బస్సు డ్రైవర్ చాకచక్యంగా బండిని నడపడంతో ఆ యువకుడు తప్పించుకున్నాడు. కేరళ రాష్ట్రం కోహికోడ్‌ రోడ్డులో ఇరుచక్ర వాహనంతో అదుపుతప్పి పడిపోయిన యువకుడు.. ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. 
 
రోడ్డుపై బురద వుండటంతో టూవీలర్ బురదలో జారి అదుపుతప్పింది. అయితే ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొనకుండా ఆ యువకుడు ఎస్కేప్ అయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.