శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 16 మార్చి 2015 (16:22 IST)

ఆధార్ నంబరుకు లంకె పెట్టొద్దని చెప్పాం : సుప్రీంకోర్టు

ప్రతి సంక్షేమ పథకానికి, సామాజిక భద్రతా పథకాలకు ఆధార్ కార్డును జత చేయాలనడం తప్పనిసరి కాదని సుప్రీం కోర్టు మరోమారు స్పష్టం చేసింది. ప్రతి పథకానికి ఆధార్‌ను అనుసంధానం చేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం విచారణకు స్వీకరించింది. 
 
ఆధార్ కార్డుపై గతంలో తాము ఇచ్చిన ఆదేశాలను తు.చ తప్పకుండా పాటించాలని కేంద్ర ప్రభుత్వానికి మరోసారి ఆదేశాలు జారీ చేసింది. ఈ కార్డుకు సంబంధించి ప్రజలను ఒత్తిడి చేయొద్దని సూచించింది. కాగా, గత సంవత్సరం ఇవే తరహా ఆదేశాలను సుప్రీంకోర్టు ఇవ్వగా, వాటిని కేంద్రం పక్కనబెట్టిన సంగతి తెలిసిందే.
 
ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన జన్‌ధన్ బ్యాంకు ఖాతాకు కూడా ఆధార్ కార్డు లింకు పెట్టిన విషయం తెల్సిందే. అలాగే, పలు సంక్షేమ పథకాలకు ప్రభుత్వం ముడిపెడుతోంది.