శబరిమలలో అడుగుపెట్టే మహిళలను రెండుగా చీల్చేయాలి- కొల్లాం తులసి

శబరిమలలో మహిళల ప్రవేశంపై మలయాళ నటుడు కొల్లాం తులసి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శబరిమల ఆలయంలోకి అడుగుపెట్టే మహిళలను రెండుగా చీల్చేయాలన్నారు.

Last Updated: శనివారం, 13 అక్టోబరు 2018 (10:54 IST)
శబరిమలలో మహిళల ప్రవేశంపై మలయాళ నటుడు కొల్లాం తులసి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆలయంలోకి అడుగుపెట్టే మహిళలను రెండుగా చీల్చేయాలన్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చెవులు పగిలేలా కీర్తనలు పఠించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సుప్రీం ఆదేశాలకు వ్యతిరేకంగా ఎన్డీయే, భారత్ ధర్మ జనసేన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవ్ శబరిమలకు ముప్పు పొంచి వుందని ఆందోళన వ్యక్తం చేశారు. 
 
శబరిమల గుడిలోకి వెళ్లేందుకు వచ్చే మహిళలను పట్టుకుని రెండు ముక్కలు చేయాలి. ఒకదానిని ఢిల్లీకి విసిరేయాలి. మరోదానిని ముఖ్యమంత్రి రూములో పడేయాల్నారు. తనకు తెలిసి మహిళలు శబరిమల వెళ్లరు. చదువుకున్నవారు.. సున్నిత మనస్కులైన వారు.. ఆ పని చేయరని వ్యాఖ్యానించారు.  అయ్యప్ప తన పని చేయడం ప్రారంభించారు. 
 
దేవాదాయ మంత్రి మనసు త్వరలోనే మారుతుందని చెప్పారు. కొల్లాం తులసి వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ప్రతిపక్షాలు, మహిళ సంఘాల నేతలు ఆయనపై దుమ్మెత్తి పోస్తున్నారు. నెటిజన్లు అయితే, విరుచుకుపడుతున్నారు. కాగా 2016 అసెంబ్లీ ఎన్నికల నుంచి కొల్లం తులసి బీజేపీతో కలిసి పనిచేస్తున్నారు.దీనిపై మరింత చదవండి :