గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (11:23 IST)

బాలీవుడ్ నటుడు సోనూ సూద్‌పై కేసు నమోదు

బాలీవుడ్ నటుడు, రియల్ లైఫ్ హీరో సోనూ సూద్‌పై కేసు నమోదైంది. పంజాబ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా సోనూ సూద్ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని పేర్కొంటూ మెగాలో కేసు నమోదు చేశారు. 
 
కాగా, సోనూ సూద్ సోదరి మాళవిక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మోగాలో పోటీ చేస్తున్నారు. ఆమె కోసం ఎన్నికల ప్రచారం కూడా చేశారు. అలాగే, పోలింగ్ సమయంలో పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారని పేర్కొంటూ ఈ కేసును నమోదు చేశారు.
 
ఎన్నికల ప్రవర్తనా నియమావళికి సంబంధించి జిల్లా అదనపు మేజిస్ట్రేట్ ఇచ్చిన ఆదేశాలను ఆయన ధిక్కరించడంతో కేసు నమోదు చేసినట్టు మెగా పోలీసులు వెల్లడించారు.