శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : బుధవారం, 17 ఫిబ్రవరి 2021 (21:24 IST)

దుస్తులు మార్చుకుంటున్న నటి: గదిలోకి వెళ్లి అత్యాచార యత్నం

దక్షిణ ముంబైలోని ఫైవ్ స్టార్ హోటల్‌లో ఒక నటిపై లైంగిక వేధింపులకు గురిచేశాడు యూనిట్ సభ్యుడు. ఇతడు వర్థమాన నటుడుగా గుర్తించారు. అతడు గ్యాస్ వెబ్ సిరీస్‌లో పనిచేశాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
 
5 నక్షత్రాల హోటల్ 37వ అంతస్తులో ఉన్న వాష్‌రూమ్‌లో నటి దుస్తులను మార్చుకుంటోంది. ఆ సమయంలో గదిలోకి ప్రవేశించిన అతడు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. చేతితో ఆమె వ్యక్తిగత భాగంపై తాకేందుకు ప్రయత్నించినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
తనను గట్టిగా పట్టుకుని అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడనీ, తను ఎలాగో తెప్పించుకుని గది బయటకు వచ్చి కేకలు వేయడంతో హోటల్ సిబ్బంది వచ్చి కాపాడినట్లు ఆమె వెల్లడించింది. నిందితుడిని దిలేశ్వర్ మహాంత్‌గా గుర్తించారు. హోటల్ సిబ్బంది అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
 
వేధింపులతో సహా పలు ఆరోపణలపై దిలేశ్వర్‌పై భారత శిక్షాస్మృతి (ఐపిసి) లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. మహిళ ఎన్‌ఎం జోషి మార్గ్‌ పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేశారు.