బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 13 అక్టోబరు 2021 (09:56 IST)

దేశంలో కొత్తగా వంద సైనిక్ పాఠశాలలు

కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా వంద సైనిక్ పాఠశాలలు నిర్మించాలని నిర్ణయించింది. 2022-23 విద్యా సంవత్సరం నుండే ఈ పాఠశాలలను ప్రారంభించాలని కేంద్రం భావిస్తోంది. 
 
కొత్తగా నిర్మించే ఈ సైనిక పాఠశాలలలో 6వ తరగతి నుండి ప్రవేశాలు ఉండనున్నాయి. అంతేకాకుండా ఈ పాఠశాల్లో ఐదువేల మంది విద్యార్థులను జాయిన్ చేసుకోనున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కేవలం 33 సైనిక పాఠశాలలు ఉన్నాయి. 
 
అంతేకాకుండా ఆరో తరగతిలో మూడు వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో సైనిక పాఠశాలలు నిర్మిస్తే దేశంలో సైనిక విద్యార్థులు పెరిగే అవకాశంవుంది. 
 
ఇక సైనిక పాఠశాలలో చదువుకున్న ఎంతోమంది విద్యార్థులు దేశ సేవ కోసం ఆర్మీలో లక్షణ రంగాల్లో పని చేస్తున్న సంగతితెలిసిందే. ఇప్పుడు రక్షణ రంగంలో పని చేయాలని కోరుకునే వారికి స్కూల్స్ పెరగటంతో అవకాశాలు పెరగనున్నాయి.