మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 23 మే 2017 (13:55 IST)

ఓ దళితుడి ఇంటికి వెళ్ళిన యడ్యూరప్ప హోటల్ ఇడ్లీ తిన్నారా?

కర్ణాటక బీజేపీ చీఫ్ బీఎస్ యడ్యూరప్ప దళితుడి ఇంటికి వెళ్లారు. ఆ ఇంట్లో యడ్యూరప్ప హోటల్ నుంచి తెచ్చిన ఇడ్లీ తిన్నారని.. దుమారం రేగింది. ఈ వివాదంపై కర్ణాటక బీజేపీ నేతలు ఓ వీడియో సైతం విడుదల చేశారు. యడ్యూ

కర్ణాటక బీజేపీ చీఫ్ బీఎస్ యడ్యూరప్ప దళితుడి ఇంటికి వెళ్లారు. ఆ ఇంట్లో యడ్యూరప్ప హోటల్ నుంచి తెచ్చిన ఇడ్లీ తిన్నారని.. దుమారం రేగింది. ఈ వివాదంపై కర్ణాటక బీజేపీ నేతలు ఓ వీడియో సైతం విడుదల చేశారు. యడ్యూరప్ప అంటరానితనాన్ని ప్రోత్సహిస్తున్నారంటూ వస్తున్న విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది. 
 
ఆ వీడియోలో యడ్యూరప్ప సందర్శించిన దళిత కుటుంబానికి చెందిన సభ్యుడొకరు మాట్లాడుతూ.. మే 19న యడ్యూరప్ప తమ ఇంటికి వచ్చి అల్పాహారం తీసుకున్నారు. ఇది తమకు చాలా ఆనందం కలిగించిందని.. అనుకున్నదాని కంటే ఎక్కువమంది రావడంతో తాము సిద్ధం చేసిన అల్పాహారం సరిపోలేదు. దీంతో వారికి సరిపడా అల్పాహారం వడ్డించేందుకు హోటల్‌కి వెళ్లి ఇడ్లీ తీసుకురావాల్సి వచ్చిందన్నాడు. 
 
యడ్యూరప్పకు తాము తయారు చేసిన అల్పాహారమే వడ్డించామని.. ఆయన తమ ఇంట్లో అల్పాహారం తీసుకోవడం ఎంతో సంతోషాన్నిచ్చిందని సదరు కుటుంబమే స్వయంగా వెల్లడించిన నేపథ్యంలో ఆయన ఏం తిన్నారో ఇంతకు మించిన సాక్ష్యం కావాలా?'' అని కర్ణాటక బీజేపీ నేత సురేష్ కుమార్ ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలే కావాలని తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని సురేష్ కుమార్ ఆరోపించారు.