ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 18 సెప్టెంబరు 2024 (18:53 IST)

చంద్రయాన్‌-4 మిషన్‌కు గ్రీన్ సిగ్నల్.. 2026 నాటికి...?

Chandrayan
చంద్రయాన్‌-4 మిషన్‌, గగన్‌యాన్‌, వీనస్‌ ఆర్బిటర్‌ మిషన్‌, ఎన్‌జీఎల్‌ఏ వాహకనౌక ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. ఇస్రో పంపిన ప్రతిపాదనలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేబినెట్‌ చంద్రయాన్‌-4 మిషన్‌కు ఆమోదం తెలిపిందని చెప్పారు.

ఈ ప్రాజెక్టులు చంద్రుడి నుంచి రాళ్లు, మట్టిని భూమిపైకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు ఇస్రో 2026 నాటికి చేపట్టాలని భావిస్తుంది. రెండు దశల్లో చంద్రయాన్‌-4 మిషన్‌ను నిర్వహిస్తుంది.

ల్యాండర్‌ను ఇస్రో నిర్మిస్తుండగా.. రోవర్‌ను జపాన్‌లో సిద్ధం చేస్తున్నారు. మిషన్‌లో భాగంగా చంద్రుడిపై మట్టి నమూనాలను సేకరించి.. తిరిగి భూమిపైకి చేరుకుంటుంది. ప్రాజెక్టు విజయవంతమైతే అంతరిక్షంలోనే స్పేస్ షటిల్‌ను రూపొందించిన దేశంగా భారత్‌ చరిత్ర లిఖించనుంది.