శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 4 అక్టోబరు 2021 (11:13 IST)

పండోరా పేపర్స్ లిస్టులో భారతీయులు: సచిన్‌తో పాటు అనిల్ అంబానీ పేర్లు

వికీలీక్స్ తరహాలో ప్రస్తుతం పండోరా పేపర్లు దేశంతో పాటు ప్రపంచంలో సంచలనం కలిగిస్తోంది. పన్ను ఎగవేయడానికి కొంతమంది ఆఫ్ షోర్ కంపెనీలను నెలకొల్పి విదేశాల్లో పెట్టుబడులను పెడుతున్న విషయాలను బయటకు తీసుకువచ్చింది. దీంట్లో దేశంతో పాటు ప్రపంచంతోని పలువురు ప్రముఖుల పేర్లు ఉన్నాయి. 
 
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, అనిల్ అంబానీతో పాటు పలువురు రాజకీయ నాయకుల పేర్లు మొత్తంగా ఇండియా నుంచి 380 మంది పేర్లు ఉన్నట్లు పండోరా పేపర్స్ వెల్లడించింది. 
 
వీరితో పాటు పలు దేశాల రాజకీయ నాయకులు ఆఫ్ షోర్ కంపెనీలు కలిగి ఉన్నట్లు తేలింది. జోర్డాన్ రాజు, కెన్యా, చెక్ రిపబ్లిక్ దేశాలకు చెందిన రాజకీయ నాయకులు, బ్రిటన్ మాజీ ప్రధాని టోనిబ్లేయర్ వంటి వారి పేర్ల ఉన్నట్లు బహిర్గతం అయ్యాయి.