Widgets Magazine

భాజపాకు మరో మిత్రపక్షం టాటా...

బుధవారం, 14 మార్చి 2018 (16:33 IST)

Widgets Magazine
bjp logo

భారతీయ జనతా పార్టీ చేజేతులా కష్టాలు కొనితెచ్చుకునేలా కనిపిస్తోంది. ఆ పార్టీకి చెందిన భాగస్వామ్య పార్టీలన్నీ ఒక్కొక్కటిగా పారిపోతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్రలో బలమైన మిత్రపక్షంగా ఉన్న శివసేన టాటా చెప్పగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార తెలుగుదేశం పార్టీ కూడా బీజేపీతో తెగదెంపులు చేసుకుంది. 
 
ఇంతలో ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో మూడు లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఓటర్లు బీజేపీకి తేరుకోలేని షాకిచ్చారు. ముఖ్యంగా, యూపీలో కంచుకోటగా భావించే గోరఖ్‌పూర్‌లో బీజేపీ అభ్యర్థి తన ప్రత్యర్థి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఈ ఫలితాలను చూసిన బీజేపీ మిత్రపక్షాలు చడీచప్పుడు కాకుండా జారుకుంటున్నాయి. 
 
ఇందులోభాగంగా కేరళకు చెందిన ఎన్డీయే మిత్రపక్షం భారత్ ధర్మ జన సేన(బీడీజేఎస్) టాటా చెప్పేసింది. కొద్దిరోజులుగా ఎన్డీఏ నుంచి వైదొలగాలా.. వద్దా అన్న అంశంపై మీమాంసలో ఉన్న బీడీజేఎస్.. యూపీ, బీహార్ ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి ప్రతికూలంగా రావడంతో పొత్తు తెంచుకోవాలని ఆ పార్టీ నిర్ణయించింది. బుధవారం ఈమేరకు పార్టీ నేతలు సమావేశమై తుది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో కేరళలో ఉన్న ఒకే ఒక్క మిత్రపక్ష పార్టీని ఎన్డీఏ (బీజేపీ) కోల్పోయినట్టయింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

'ముగింపునకు నాంది' .. బీజేపీకి పతనం ప్రారంభం : మమతా బెనర్జీ

ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో జరిగిన లోక్‌సభ ఉపఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీకి ...

news

బీజేపీ నుంచి దేవుడు ముఖం తిప్పుకున్నాడు.. యూపీ బైపోల్ రిజల్ట్స్‌పై సంజయ్ రౌత్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన రెండు లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో అధికార ...

news

ఉండవల్లి గ్రామ ఓటర్లుగా చంద్రబాబు కుటుంబ సభ్యులు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు ఉండవల్లి గ్రామ ఓటర్లుగా మారిపోయారు. ఈ మేరకు ...

news

తెలంగాణ పాలిట తొలి విలన్ కాంగ్రెస్ పార్టీనే : కేసీఆర్ నిప్పులు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ మరోమారు కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా ...