శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 18 మార్చి 2022 (13:48 IST)

తెలంగాణాపై దృష్టిసారించిన కేజ్రీవాల్ - 14 నుంచి ఆప్ పాదయాత్రలు

ఢిల్లీ నుంచి పంజాబ్‌కు విస్తరించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఇపుడు తెలంగాణ రాష్ట్రంపై దృష్టిసారించింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఆప్ అదే జోష్‌తో తెలంగాణాలో పాగా వేసేందుకు ప్రయత్నిస్తుంది. ఇందులోభాగంగా ఏప్రిల్ 14వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు నిర్వహించేందుకు సమాయాత్తమవుతుంది. 
 
వచ్చే నెల 14వ తేదీన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆప్ ఆధ్వర్యంలో తెలంగాణాలో పాదయాత్రలు ప్రారంభమవుతాయి. వీటిని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభిస్తారని ఆప్ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ఆప్ తెలంగాణ సెర్చ్ కమిటీ ఏర్పాట్లు చేస్తుంది. తెలంగాణాలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ పాదయాత్రలు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. 
 
కాగా, ఇటీవల వెల్లడైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ రాష్ట్రంలో ఆప్ పార్టీ విజయభేరీ మోగించిన విషయం తెల్సిందే. దీంతో ఢిల్లీ తర్వాత పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.