Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

దిల్ ఉంటే.. ఎమ్మెల్యేలను విడిచిపెట్టండి.. శశికళ పోయెస్ గార్డెన్‌లో ఉండే హక్కు లేదు: ఓపీఎస్

గురువారం, 9 ఫిబ్రవరి 2017 (12:45 IST)

Widgets Magazine

రాజకీయ బలం లేకపోయినా.. ప్రజల్లో వెల్లువెత్తుతున్న మద్దతు పన్నీర్ సెల్వం పట్ల సానుభూతిని పెంచుతోంది. ఈ సానుభూతే శశికళకు వ్యతిరేకంగా ఆయన్ను ధీటుగా నిలబడేలా చేస్తోంది. ఈ నేపథ్యంలో తమిళనాడు ఆపద్ధర్మ సీఎం పన్నీ సెల్వం శశికళకు సవాల్ విసిరారు.

గవర్నర్ ఎదుట తన బలాన్ని నిరూపించుకుని తానే సీఎం కుర్చీలో కూర్చుంటానని ధీమా వ్యక్తం చేశారు. శశికళకు ధైర్యముంటే ఎమ్మెల్యేలను బయటకు పంపి, గవర్నర్ ఎదుట బలాన్ని నిరూపణకు సిద్ధపడాలని సవాల్ చేశారు. గురువారం గవర్నర్ చెన్నైకి రానున్న నేపథ్యంలో శశికళ వర్గంతో పోటీపడేందుకు పన్నీర్ సై అంటున్నారు. 
 
పనిలో పనిగా పోయెస్ గార్డెన్ నుంచి చక్రం తిప్పడానికి ప్రయత్నిస్తున్న శశికళను అక్కడినుంచి తరిమేస్తానని పన్నీర్ గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఎప్పుడూ సున్నిత వ్యాఖ్యలకే పరిమితమయ్యే పన్నీర్ నోట ఇలాంటి పదునైన వ్యాఖ్యలు రావడం ఇదే తొలిసారి. పోయెస్ గార్డెన్‌లో ఉండే హక్కు శశికళకు లేదని, ఆ ఇంటిని అమ్మ స్మారక కేంద్రంగా మారుస్తానని తెలిపారు.

అవినీతి కేసులున్న వ్యక్తుల ప్రవేశంతో పోయిస్ గార్డెన్‌ను శశికళ కుటుంబ సభ్యులు అపవిత్రం చేశారని నిప్పులు చెరిగారు. జయమ్మకు వీరవిధేయురాలిని అని చెప్పుకునే శశికళ.. జయలలితకు ఇష్టం లేకపోయినా.. ఆమె కుటుంబ సభ్యులను పోయెస్ గార్డెన్‌లోకి ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

చెన్నైకు రానున్న గవర్నర్.. తొలి పిలుపు పన్నీర్‌కే... ఎందుకంటే...

తమిళనాడు తాత్కాలిక గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ రావు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు చెన్నైకు ...

news

స్మారక నిలయంగా పోయెస్ గార్డెన్ ఇల్లు . పన్నీర్ ఆదేశాలు : అడ్డుకుంటానన్న శశికళ

ముఖ్యమంత్రి దివంగత జయలలితకు అత్యంత ప్రీతిపాత్రమైన పోయెస్ గార్డెన్‌లోని వేద నిలయం ఇపుడు ...

news

గోల్డెన్‌ బే రిసార్ట్‌లో ఎమ్మెల్యేల మస్తు మజా.. బాత్రూమ్ బ్రేక్ అంటూ షణ్ముగనాథన్ ఎస్కేప్.. ఓపీ ఇంటికెళ్లారా?

అమ్మ సెంటిమెంట్.. తీవ్ర ఉత్కంఠ.. బల పరీక్షలో నెగ్గేదెవరు? సీఎం పీఠం ఎవరిని వరిస్తుంది? ...

news

సోషల్ మీడియాలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేల ఫోన్ నంబర్లు... సపోర్ట్ పన్నీర్ అంటూ ట్వీట్లు...

తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న ఓ పన్నీర్ సెల్వంకు మద్దతు అంతకంతకూ పెరుగుతోంది. ...

Widgets Magazine