Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఎస్పీ అధినేతగా అఖిలేష్.. ములాయంకు షాక్

గురువారం, 5 అక్టోబరు 2017 (17:42 IST)

Widgets Magazine
akhilesh yadav

సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) జాతీయ అధ్యక్షుడిగా ఉత్తర్‌ ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం ఆగ్రాలో జరిగిన ఎస్పీ జాతీయ సదస్సులో ఆయన్ను పార్టీ అధినేతగా ఎన్నుకున్నారు. అయితే సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, అఖిలేష్‌ తండ్రి అయిన ములాయం సింగ్‌ యాదవ్‌ ఈ సమావేశానికి హాజరు కాలేదు. 
 
కాగా, పార్టీ అధ్యక్షుడిగా అఖిలేష్ ఐదేళ్ల పాటు కొనసాగుతారని ఎస్పీ సీనియర్ నేత రాంగోపాల్ యాదవ్ తెలిపారు. అఖిలేష్‌ యాదవ్‌ నాయత్వంలోనే 2019 లోక్‌సభ, 2022 ఉత్తర్‌ప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆయన ప్రకటించారు. 
 
సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడి పదవీకాలం గతంలో మూడేళ్లు ఉండగా.. దానిని పార్టీ రాజ్యాంగాన్ని సవరించి ఐదేళ్లకు పెంచినట్లు రాంగోపాల్‌ యాదవ్‌ తెలిపారు. యూపీ ఎన్నికల సమయంలో ములాయంకు, అఖిలేష్‌కు మధ్య విభేధాలు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. సమయంలోనే ములాయంను పార్టీ అధ్యక్షుడిగా తొలగించి ఆ స్థానాన్ని అఖిలేష్‌ ఆక్రమించారు. దీంతో అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు ములాయం దూరంగా ఉంటున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

జనసేనకు జెండానే లేదు.. మంత్రి పితాని సత్యనారాయణ

హీరో పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీకి రాష్ట్రంలో జెండానే లేదనీ రాష్ట్ర మంత్రి ...

news

బాలయ్యా... నీ తీరేం బాగోలేదు : తెలుగుదేశం నేతల్లో అసంతృప్తి!

టీడీపీ నేత, సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వైఖరిపై ఆ పార్టీ నేతలు తీవ్ర ...

news

ఎస్‌ఐ బదిలీ అయితే గ్రామస్తులందరూ వెక్కివెక్కి ఏడ్చారు..!

ఆయనేమీ రాజకీయ నేత కాదు.. సినిమా హీరో అంతకన్నా కాదు. కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ...

news

మొన్న ముంబై నిన్న హైదరాబాద్ ఇపుడు చెన్నై.. ఈ వారంలోనే రెండు తుఫాన్లు!

ఈ యేడాది వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. మొన్నటికిమొన్న ముంబై మహానగరాన్ని భారీ వర్షాలు ...

Widgets Magazine