శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 8 ఏప్రియల్ 2020 (10:18 IST)

మద్యం విక్రయాలు ప్లీజ్

మద్యం అమ్మకాలను అనుమతించాలని భారత ఆల్కహాలిక్‌ బెవరేజ్‌ కంపెనీల సమాఖ్య (సీఐఏబీసీ) విజ్ఞప్తి చేసింది. లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న కారణంగా మద్యం షాపులను మూసివేసినా చాలాచోట్ల మద్యం అక్రమ అమ్మకాలు జరుగుతున్నాయని అభిప్రాయపడింది.

ఈ మేరకు  తెలంగాణ, ఢిల్లీ, హరియాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, పంజాబ్‌, రాజస్థాన్‌, యూపీ, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సీబీఏబీసీ  లేఖ రాసింది.

మద్యంషాపుల మూసివేతతో తాగుడుకు అలవాటు పడినవారి ఆరోగ్యంపై ప్రభావం పడుతోందని, ఇది మున్ముందు శాంతిభద్రతలపైనా ప్రభావం చూపవచ్చని లేఖలో సీఐఏబీసీ డైర్టెకర్‌ జనరల్‌ వినోద్‌ గిరి పేర్కొన్నారు.

లాక్‌డౌన్‌తో షాపులు మూసివేయించిన దృష్ట్యా మద్యం షాపుల లైసెన్సులను నెల పాటు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు.