ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 15 జనవరి 2023 (17:01 IST)

మద్యం మత్తులో భర్త కర్కశంగా ప్రవర్తించాడు.. గర్భిణీని బైకుకు కట్టేసి..?

మద్యం మత్తులో ఓ భర్త భార్య పట్ల కర్కశంగా ప్రవర్తించాడు. గర్భిణీ అయినప్పటికీ... ఆమెపై దాడికి పాల్పడ్డాడు. అంతేకాకుండా బైకుకు కట్టేసి రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లాడు. ఈ ఘటన యూపీలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. యూపీలో రామ్ గోపాల్ అనే వ్యక్తి భార్య సుమనపై దాడి చేసి చేతులను బైకుకు కట్టేసి రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లాడు. యూపీలోని పీలీభీత్ జిల్లాలో శనివారం ఈ దారుణం జరిగింది. 
 
తీవ్రంగా గాయపడ్డ మహిళ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలి సోదరుడి ఫిర్యాదుతో పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 
బినాలి, సుమన్ సోదరుడు తన సోదరిని కాపాడి ఆసుపత్రిలో చేర్చాడు. రామ్ గోపాల్, సుమన్‌ల వివాహం జరిగి మూడేళ్లు కావస్తోంది. పెళ్లయిన కొద్ది రోజులకే భర్త డ్రగ్స్‌కు బానిసయ్యాడని సుమన్ తెలిపారు. గర్భిణీ మహిళ సుమనకు ప్రస్తుతం ఎనిమిదో నెలని