ఆలిండియా రేడియోలో లైంగిక వేధింపులు.. న్యూస్ రీడర్లు, యాంకర్లను..?

Last Updated: శనివారం, 8 డిశెంబరు 2018 (11:30 IST)
ఆలిండియా రేడియోలో లైంగిక వేధింపుల కేసులు నమోదైనాయి. ఆలిండియా రేడియో అధికారిపై తొమ్మిది మంది మహిళలు లైంగిక ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ఆలిండియా రేడియో అధికారిపై తొమ్మిది మంది మహిళలు చేసిన ఆరోపణల్లో నిజం వుందని జాతీయ మహిళా కమిషన్ కూడా తేల్చేసింది. 
 
ఇందులో భాగంగా ఆలిండియా రేడియో అధికారిని డిమోట్ చేస్తున్నామని.. వేతనాన్ని కూడా తగ్గిస్తున్నామని మహిళా కమిషన్ వెల్లడించింది. అంతేగాకుండా మహిళా కమిషన్ చేసిన సిఫార్సులను ఏఐఆర్ క్రమశిక్షణా కమిటీ అంగీకరించింది. అతనిపై జరిమానాను విధించడంతో పాటు పే స్కేలును రెండు స్టేజ్‌లు తగ్గించేందుకు నిర్ణయించింది. 
 
ఇక ఆలిండియా అధికారిపై లైంగిక ఫిర్యాదులు చేసిన వారిలో న్యూస్ రీడర్లు, యాంకర్లు, ఇతర ఉద్యోగులు వున్నారు. నవంబర్ 12వ తేదీన సదరు అధికారిపై ఫిర్యాదులు అందాయి. ఆపై నేషనల్ ఉమెన్ కమిషన్ రంగంలోకి దిగి విచారణ జరిపింది. ప్రసార భారతిలో లైంగిక వేధింపులను తీవ్రంగా పరిగణిస్తున్నామని.. మహిళల భద్రతపై తగిన చర్యలు తీసుకుంటామని ప్రసారాల మంత్రిత్వ శాఖ తెలిపారు. దీనిపై మరింత చదవండి :