శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

ఏ భార్య తన భర్తను మరో మహిళతో పంచుకోవాలని కోరుకోదు : అలహాబాద్ హైకోర్టు

court
భార్యాభర్తల బంధంపై అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏ ఒక్క భార్య కూడా తన భర్తను పరాయి మహిళతో పంచుకోవాలని కోరుకోదని వ్యాఖ్యానించింది. అందువల్ల అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భార్యకు తెలియకుండా రహస్యంగా మరో పెళ్లి చేసుకోవడం నేరమేనని అలహాబాద్ న్యాయస్థానం తీర్పునిచ్చింది. 
 
భార్య ఆత్మహత్యకు పురిగొల్పాడంటూ కింద కోర్టు నమోదు చేసిన అభియోగాలను కొట్టి వేయాలని కోరుతూ ఓ వ్యక్తి వేసిన పిటిషన్‌పై జస్టిస్ రాహుల్ చతుర్వేది సారథ్యంలోని హైకోర్టు ధర్మానసం ఆ పిటిషన్‌ను తోసిపుచ్చుతూ పిటిషనర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
నిందితుడు ఒకరికి తెలియకుండా ఒకరి చొప్పున మొత్తం మూడు పెళ్లిళ్లు చేసుకుందని, అందువల్ల అతడి భార్య ఆత్మహత్య చేసుకుందని వ్యాఖ్యానించింది. ఓ భార్య తన ప్రాణాలు తీసుకోవడానికి కట్టుకున్న భర్త రహస్యంగా మరో పెళ్లి చేసుకోవడమన్న ఒక్క కారణం చాలని ధర్మాసనం అభిప్రాయపడింది. మరో మహిళతో కలసి తన భర్త కాపురాన్ని పంచుకోవాలనుకోవడం ఓ భార్యకు శరాఘాతమేనని అన్నారు.