శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 8 ఫిబ్రవరి 2017 (20:28 IST)

హీటెక్కిన తమిళ రాజకీయాలు.. ఓపీ వర్సెస్ శశికళ.. రాష్ట్రానికి గవర్నర్ వచ్చేస్తున్నారా?

తమిళనాడు రాజకీయాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు ఇన్‌ఛార్జి గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు చెన్నైకి రానున్నట్లు సమాచారం. గురువారం మధ్యాహ్నం గవర్నర్‌ ముంబయి నుంచి చెన్నై రాజ్‌భవన్‌కు చేరుకుంటారని

తమిళనాడు రాజకీయాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు ఇన్‌ఛార్జి గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు చెన్నైకి రానున్నట్లు సమాచారం. గురువారం మధ్యాహ్నం గవర్నర్‌ ముంబయి నుంచి చెన్నై రాజ్‌భవన్‌కు చేరుకుంటారని తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని కలిసేందుకు తంబిదురై నేతృత్వంలో అన్నా డీఎంకే ఎంపీలు ఢిల్లీకి పయనమయ్యారు. రాష్ట్రంలో అనిశ్చితి తొలగించాలని రాష్ట్రపతిని కోరనున్నారు. 
 
ముఖ్యమంత్రి పదవికోసం శశికళ, పన్నీర్‌సెల్వం మధ్య హోరాహోరీ పోరు నేపథ్యంలో గవర్నర్‌ తీసుకోబోయే నిర్ణయం కోసం తమిళనాడు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమిళనాడు రాష్ట్రం రాజకీయ సెగతో అల్లాడిపోతోంది. రాష్ట్ర సీఎం పన్నీర్‌సెల్వమా, శశికళా అనే దానిపై సర్వత్రా తీవ్ర చర్చలకు దారితీస్తోంది.
 
ఇదిలా ఉంటే.. తమిళనాడులో నాటకీయ పరిణామాల మధ్య అన్నాడీఎంకే ఆఫీసులో శశికళ వర్గానికి చెందిన ఎమ్మెల్యేల సమావేశంలో... శశికళ మాట్లాడుతూ.. 48 గంటల్లో పన్నీర్‌ సెల్వం మాటమార్చారని ఆరోపించారు. పన్నీర్‌ సెల్వం వెనక కొందరు ఉండి నడిపిస్తున్నారని ఆమె చెప్పారు. తనకు 130 మంది ఎమ్మెల్యే మద్దతు ఉందని, అన్నాడీఎంకే ఎమ్మెల్యేలంతా తనవైపే ఉన్నారని శశికళ ధీమా వ్యక్తం చేశారు. జయలలిత బాటలోనే నడుద్దామని ఆమె పిలుపునిచ్చారు.