గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 2 సెప్టెంబరు 2022 (22:47 IST)

తిరువనంతపురం వేదికగా సదరన్ స్టేట్స్ జోనల్ కౌన్సిల్ మీట్..

stalin - vijayan
కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ సదస్సు శనివారం తిరువనంతపురం వేదికగా జరుగనుంది. ఇందుకోసం హోం మంత్రి అమిత్ షా ఇప్పటికే కేరళ రాష్ట్రానికి చేరుకున్నారు. అలాగే, ఈ సమావేశానికి హాజరయ్యేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శుక్రవారం రాత్రే తిరువనంతపురంకు చేరుకున్నారు. 
 
ఆయన శనివారం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో సమావేశమై ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేసేలా చర్చించాల్సిన అంశాలపై దృష్టిసారించారు. ముఖ్యంగా, సీఎంగా స్టాలిన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేరళ, తమిళనాడు రాష్ట్రాల మధ్య మెరుగైన సంబధాల కోసం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కృషి చేస్తున్న విషయం తెల్సిందే. అలాగే, శనివారం జరిగే జోనల్ కౌన్సిల్ సద్సులోనూ చర్చించాల్సిన అంశాలపై వారిద్దరూ చర్చించుకున్నారు. 
 
అలాగే, ఈ సదస్సులో పాల్గొనేందుకు తెలంగాణ సీఎం తరపున ఆ రాష్ట్ర హోం మంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి మహమూద్ అలీ కూడా శుక్రవారం రాత్రికే తిరువనంతపురానికి చేరుకున్నారు. అలాగే, ఏపీ, కర్నాటక, పుదుచ్చేరి, లక్ష్యద్వీప్, అండమాన్ నికోబార్ దీవులకు చెందిన ప్రతినిధులు కూడా ఈ సదస్సుకు హాజరుకానున్నారు.