బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 28 ఏప్రియల్ 2020 (15:36 IST)

నీతి ఆయోగ్ కార్యాలయ ఆఫీసర్‌కు కరోనా పాజిటివ్

ఈ కరోనా వైరస్ ఓ ఒక్కరినీ వదిలిపెట్టడం లేదు. పుట్టినబిడ్డ నుంచి పండు ముదుసలి వరకు ఈ వైరస్ బారినపడుతున్నారు. అంతేకాకుండా, ఈ ఆఫీస్.. ఆ ఆఫీస్ అని లేకుండా అన్ని ఆఫీసులకు ఈ వైరస్ సోకుతోంది. తాజాగా సుప్రీంకోర్టు, జ్యూడీషియల్ విభాగంలో పని చేసే ఓ ఉద్యోగికి ఈ వైరస్ సోకింది. ఇపుడు ఢిల్లీలోని నీతి ఆయోగ్ కార్యాలయంలో పని చేసే ఆఫీసర్‌కు పాజిటివ్ అని తేలింది. 
 
దీంతో ఈ కార్యాలయ భవనాన్ని సీజ్ చేశారు. రెండు రోజుల పాటు ఆ బిల్డింగ్‌లో శానిటైజేష‌న్ డ్రైవ్ నిర్వ‌హించ‌నున్నారు. ఈ విష‌యాన్ని నీతి ఆయోగ్ డిప్యూటీ సెక్ర‌ట‌రీ అజిత్ కుమార్ తెలిపారు. ఆరోగ్య శాఖ ఆదేశాల ప్ర‌కారం బిల్డింగ్‌ను మూసివేస్తున్నారు. ఇక పాజిటివ్ వ‌చ్చిన అధికారితో ట‌చ్‌లో ఉన్న‌వారిని క్వారెంటైన్‌లోకి వెళ్లాల‌ని ఆదేశించారు.
 
మ‌రోవైపు దేశ‌వ్యాప్తంగా 80 జిల్లాల్లో గ‌త ఏడు రోజుల నుంచి ఎటువంటి కొత్త కేసులు న‌మోదు కాలేద‌ని కేంద్ర మంత్రి హ‌ర్ష‌వ‌ర్థ‌న్ వెల్లడించారు. 47 జిల్లాల్లో గ‌త 14 రోజుల నుంచి ఎటువంటి పాజిటివ్ కేసు న‌మోదు కాలేదని గుర్తుచేశారు.