చీనాబ్ బ్రిడ్జిపై జేమ్స్‌బాండ్ నెక్ట్స్ మూవీ ఓపెనింగ్ సీన్ తీయాలి..?
జమ్మూకాశ్మీర్‌లో భారత రైల్వేశాఖ చీనాబ్ నదిపై వంతెనను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాంతంలో నిత్యం బలమైన గాలులు వీస్తుంటాయి. 2004లోనే ఈ కట్టడం నిర్మాణం ప్రారంభం కాగా, భారీ గాలుల కారణంగా పనులు నిదానంగా సాగుతున్నాయి.
గంటకు 260 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను సైతం తట్టుకునే విధంగా ఈ బ్రిడ్జిని నిర్మిస్తున్నట్టు రైల్వే అధికారులు పేర్కొన్నారు.
ఇటీవలే ఈ వంతెనకు సంబంధించిన ఫొటోలను రైల్వేశాఖ, రైల్వేశాఖ మంత్రి షేర్ చేశారు. ప్రకృతి ఒడిలో నిర్మిస్తున్న అద్భుతమైన కట్టడంగా నెటిజన్లు అభివర్ణిస్తున్నారు. ఈ చీనాబ్ నదిపై నిర్మిస్తున్న ఈ వంతెనపై ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.
జేమ్స్‌బాండ్ నెక్ట్స్ మూవీ ఓపెనింగ్ సీన్ ఈ బ్రిడ్జిమీద తీయాలని కోరుకుంటున్నట్టు ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. చీనాబ్ నదిపై భారత ఇంజనీర్లు నిర్మిస్తున్న అద్భుతమైన కట్టడం ఇదని ఆయన పేర్కొన్నారు.