Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రెండు రోజుల్లో శశికళ కథ సమాప్తం : సీఎం పన్నీర్ వర్గం నేత పాండ్యన్

గురువారం, 9 ఫిబ్రవరి 2017 (18:00 IST)

Widgets Magazine
aiadmk

తమిళనాడులో శశికళ వ్యతిరేక వర్గం బలం పెరుగుతోంది. ఈ క్రమంలో, పన్నీర్ సెల్వం వర్గానికి చెందిన అన్నాడీఎంకే నేత పాండ్యన్ మరోసారి శశికళపై నిప్పులు చెరిగారు. మరో రెండు రోజుల్లో శశికళ కథ ముగిసిపోతుందని ఆయన జోస్యం చెప్పారు. తాను ఎన్నటికీ రాజకీయాల్లోకి రానని, తనకు రాజకీయ పదవుల పట్ల ఆసక్తి లేదంటూ జయలలితకు 2012లో శశికళ లేఖ రాశారని చెప్పిన ఆయన... ఇప్పుడెందుకు ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్నారని ప్రశ్నించారు. తామంతా ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తమిళ ప్రజలంతా శశికళకు బుద్ధి చెబుతారని అన్నారు. 
 
అంతకుముందు... గురువారం చెన్నైకు వచ్చిన తాత్కాలిక గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ రావును ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులతో పాటు.. తన రాజీనామాకు దారితీసిన వాస్తవ విషయాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. శ‌శిక‌ళ చేసిన ఒత్తిడి వ‌ల్లే తాను రాజీనామా చేశాన‌ని విద్యాసాగ‌ర్ రావుతో చెప్పారు. త‌న రాజీనామాకు దారితీసిన అన్ని ప‌రిస్థితుల‌ను గురించి ఆయ‌న స‌మ‌గ్రంగా వివ‌రించారు. పార్టీలో తన బలాన్ని ఎలా ప్రదర్శిస్తారో చెప్పారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Ch Pandyan Sasikala Chapter O Panneerselvam Team

Loading comments ...

తెలుగు వార్తలు

news

గవర్నర్‌తో పన్నీర్ భేటీ ఓవర్.. ధర్మమే గెలుస్తుందన్న ఓపీఎస్.. శశిపై స్టాలిన్ ఫైర్

తమిళనాట రాజకీయాలు హీటెక్కాయి. శశికళ వర్సెస్ పన్నీర్ సెల్వం వార్ జరుగుతోంది. తమ బలాన్ని ...

news

శశికళకు పన్నీర్ సెల్వం ఎలా చెక్ పెడుతున్నారు? పక్కా పొలిటికల్ లీడర్ ఎలా మారాడు?

అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న ఓ. పన్నీర్ ...

news

అబ్బెబ్బే... మాకెలాంటి సంబంధం లేదు : టీఎన్ పాలిట్రిక్స్‌పై రాజ్‌నాథ్

తమిళనాడు రాష్ట్రంలోని అధికార అన్నాడీఎంకేలో తలెత్తిన సంక్షోభానికి తమకు ఎలాంటి సంబంధం లేదని ...

news

సీఎం పీఠంపై శశి ఆశకు కారణం అదే?: జయలలితను ఎంజీఆర్, రాజీవ్ ఆనాడే హెచ్చరించారా?

1987వ సంవత్సరం ఓ రోజున ఎంజీఆర్.. జయలలితను పిలపించారు. "నీవు ఏమైనా చెయ్.. మద్దతిస్తా... ...

Widgets Magazine