Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మీరు కన్యనో కాదో చెప్పండి రేప్ జరిగితే ఉపయోగపడుతుంది.. అసుపత్రి నిర్వాకం

హైదరాబాద్, గురువారం, 3 ఆగస్టు 2017 (05:49 IST)

Widgets Magazine

ఆ ప్రభుత్వ ఆసుపత్రి మనుషుల గౌరవానికి సంబంధించిన అన్ని విలువలనూ తోసి పడేసింది. వైద్య సంస్థలో ఉద్యోగంలో చేరేవారు నింపాల్సిన దరఖాస్తులోని వివాహస్థితి పత్రంలో  మీరు కన్యో కాదో చెప్పండి అనే ఆప్షన్ ఉంచి నింపమనడం సంచలనం కలిగిస్తోంది. ఏమిటీ దారుణం అని అడిగితే ఉద్యోగులపై అత్యాచారాలు జరిగినప్పుడు కన్యనా, కాదా అనే సమాచారం ఉపయోగపడొచ్చని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ చెప్పడం మరింత వివాదానికి దారి తీసింది.
 
ఏదైనా ఉద్యోగంలో చేరేముందు అభ్యర్థి వివాహ స్థితి గురించిన సమాచారాన్ని సంస్థ అడగడం మామూలే. బిహార్‌లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రి మాత్రం ఉద్యోగంలో చేరేవారు కన్యనా కాదా అనే సమాచారాన్ని అడగడం పలువురి ఆగ్రహానికి కారణమవుతోంది. పట్నాలోని ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో ఉద్యోగంలో చేరేవారు నింపాల్సిన దరఖాస్తులోని వివాహ స్థితి పత్రంలోని ఓ సెక్షన్‌లో ‘నేను బ్రహ్మచారి వితంతువు కన్య’ అని ఉంది.
 
అలాగే ‘నాకు ప్రస్తుతం జీవించి ఉన్న ఒకే భార్య ఉంది’, ‘నాకు పెళ్లైంది, ఒకరి కన్నా ఎక్కువ మంది భార్యలు ఉన్నారు’, ‘నేను పెళ్లి చేసుకున్న అతనికి జీవించి ఉన్న మరో భార్య లేదు’, ‘నేను పెళ్లి చేసుకున్న అతనికి జీవించి ఉన్న మరో భార్య కూడా ఉంది’ లాంటి వింత ఆప్షన్లు కూడా ఆ పత్రంలో ఉన్నాయి. అభ్యర్థి వీటిలో తనకు ఏది సరిపోలుతుందో దానిని టిక్‌ చేయాలి. వీటిపై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ మాట్లాడుతూ, ఉద్యోగులపై అత్యాచారాలు జరిగినప్పుడు కన్యనా, కాదా అనే సమాచారం ఉపయోగపడొచ్చని చెప్పడం మరింత వివాదానికి దారి తీసింది.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఎనిమిది వేలకు చూసుకున్నారు.. ఆరు కోట్లు కక్కమంటే ఖంగుతిన్నారు

ఒప్పందాలు చేసుకుని ఆ తర్వాత దానికి భిన్నంగా వ్యవహరించడం మనకే అలవాటనుకుంటే అమెరికాలోనూ ...

news

భారత్‌తో యుద్ధం చేస్తే తట్టుకోలేం.. చైనా మిలిటరీ నిపుణుల హెచ్చరిక

ఇండియాతో సరిహద్దు తగవు ముదిరి యుద్దమే సంభవిస్తే ఘోరంగా నష్టపోయేది చైనాయే కాని భారత్ కాదని ...

news

విజయవాడలో లైట్ మెట్రో... మంత్రి నారాయణ, పచ్చజెండా ఊపిన బాబు

అమరావతి: విజయవాడలో లైట్ మెట్రో ప్రజా రవాణా వ్యవస్థకు సీఎం చంద్రబాబునాయుడు గ్రీన్ సిగ్నల్ ...

news

ఒంటరిగా ఉన్న మహిళ.. యువకుడి అత్యాచారయత్నం.. దాన్ని నోటితో కొరికేసింది

ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై ఓ యువకుడు అత్యాచారం చేసేందుకు యత్నించాడు. దీంతో ఆ మహిళ తిరగబడి ...

Widgets Magazine