1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 19 ఫిబ్రవరి 2024 (22:24 IST)

అఫ్జల్ ఖాన్‌ను ఛత్రపతి శివాజీ చంపినప్పుడు పక్కనే ఎవరున్నారో తెలుసా?: అసదుద్దీన్ ఓవైసి

asaduddin owaisi comments on shivaji maharaj
ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఓవైసి ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా చేసిన వ్యాఖ్యలు తాలూకు పాత వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా అసదుద్దీన్ మరాఠ సోదరులకు శుభాకాంక్షలు చెప్పారు. ఆ సందర్భంగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసారు. ఛత్రపతి శివాజీ ముస్లింలను వ్యతిరేకించారంటూ ఆర్ఎస్ఎస్ ప్రచారం చేస్తుందనీ, కానీ ఇందులో వాస్తవం లేదని అన్నారు.
 
శివాజీ కేవలం పేదల పక్షాన నిలిచి పోరాడారని అన్నారు. అసలు శివాజీకి అంగరక్షకులుగా ముస్లింలు వున్నారని చెప్పారు. ఆయన వద్ద 13 మంది ముస్లిం జనరల్ అధికారులు పనిచేసేవారని చెప్పారు.
 
పేదల పక్షాన పోరాడిన ఛత్రపతి శివాజీ మొఘల్ సామ్రాజ్యధినేతలకు వ్యతిరేకంగా పోరాడారనీ, ముస్లింలను-ఇస్లాంను ఆయన వ్యతిరేకించలేదని వెల్లడించారు. ఆనాడు ఆగ్రా నుంచి ముస్లింలతో కలిసి శివాజీ పారిపోయారనీ, అప్జల్ ఖాన్ ను చంపినప్పుడు ఆయన పక్కన వున్న బాడీగార్డులు ముస్లింలే అని అన్నారు. కనుక శివాజీ ముస్లిం వ్యతిరేకి అంటూ ఆర్ఎస్ఎస్ నాయకులు చేసే ప్రచారం అంతా అవాస్తం అని అన్నారు. ఇందుకు సంబంధించిన పాత వీడియో ప్రస్తుతం నెట్లో హల్చల్ చేస్తోంది.