గురువారం, 12 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 5 డిశెంబరు 2024 (12:13 IST)

Asam Beef Ban అస్సాంలో గొడ్డుమాంసంపై నిషేధం

assam
రెస్టారెంట్స్‌లలో బీఫ్ విక్రయాలు నిషేధం 
గొడ్డు మాంసం వంటకాలపై అస్సాం నిషేధం 
 
అస్సాంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా గొడ్డుమాంసం (బీఫ్)తో తయారు చేసే వంటకాలపై నిషేధం విధించింది. ఇకపై అస్సాం రాష్ట్రంలోని హోటల్స్, రెస్టారెంట్స్, బహిరంగ ప్రదేశాల్లో పశుమాంసంతో తయారు చేసిన వంటకాలు విక్రయరాదని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఓ ప్రకటన చేశారు. 
 
కొత్త నిబంధనల్ని చట్టంలో చేర్చాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. తమ రాష్ట్రంలో గొడ్డుమాంసం వినియోగానికి సంబంధించి ప్రస్తుతమున్న చట్టం పటిష్ఠంగానే ఉన్నా అందులో రెస్టారెంట్లు, హోటళ్లతోపాటు మతపరమైన, సామాజిక కార్యక్రమాల సందర్భంగా ఆ మాంసాన్ని వినియోగించడంపై ఇప్పటివరకూ నిషేధం లేదన్నారు. అస్సాంలో బహిరంగ ప్రదేశాల్లో గొడ్డుమాంసం వినియోగాన్ని నిషేధించాలని ఇప్పుడు నిర్ణయించినట్లు తెలిపారు.