ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , గురువారం, 20 జులై 2017 (10:47 IST)

సహోద్యోగినితో సంబంధం వదలవు.. పెళ్లెందుకురా నీకు రోగ్... అన్యాయంగా నటిని చంపేశాడు

జీవితాన్ని మూడుపదులు దాటకముందే తుంచేసుకోవాలని నిర్ణయించుకోవడానికి మూడు నిమిషాలు పట్టకపోవచ్చు. కానీ తప్పుచేసింది ఒకడైతే చేయని తప్పుకు మరొకరు అన్యాయంగా జీవితాన్ని బలి తీసుకుంటే ఎవరు నష్టపోయినట్లు, ఎవరు లాభపడినట్లు.

జీవితాన్ని మూడుపదులు దాటకముందే తుంచేసుకోవాలని నిర్ణయించుకోవడానికి మూడు నిమిషాలు పట్టకపోవచ్చు. కానీ తప్పుచేసింది ఒకడైతే చేయని తప్పుకు మరొకరు అన్యాయంగా జీవితాన్ని బలి తీసుకుంటే ఎవరు నష్టపోయినట్లు, ఎవరు లాభపడినట్లు. రోజూ కొన్ని డజన్లమంది తమ భర్త వేరొకరితో సంబంధం కలిగి ఉన్నాడని, నిరాదరిస్తున్నాడని కుంగిపోతూ ఆత్మహత్యల పాలవుతున్నారు. నన్నేలుకోవా అంటూ భంగపడి, బామాలి సాధ్యం కాకపోవడంతో చిన్న వయస్సులోనే నిండుజీవితాన్ని చిదిమేసుకుంటున్న  యువతులు పచ్చి ఫ్యూడల్ సంప్రదాయాన్ని కొత్తరూపంలో పాటించటం లేదా? ఎలాంటి ఆదరవు లేనివారు, ఉద్యోగం, వృత్తి లేని వారు దాంపత్య జీవితంలో భర్త నుంచి ఎదురయ్యే తిరస్కారాన్ని తట్టుకోలేక ఆత్మహత్యల పాలవుతున్నారంటే వాటికి ఒక ప్రాతిపదిక అయినా ఉందని భావించవచ్చు. 
 
కానీ వృత్తి జీవితంలో ఉండి, ఆర్థిక స్వతంత్రత అంతో ఇంతో కలిగి ఉన్న మహిళలు కూడా మేల్ పిగ్ కాస్త దూరం పెట్టాడని నిరాశపడిపోయి జీవితాన్ని ముగించుకుంటోంటే కుటుంబాలు పిల్లలకు ఏం నేర్పుతున్నాయని అనిపించక మానదు. ప్రముఖ నటిగానో ఉద్యోగులుగానో, వృత్తి జీవులుగానో  గుర్తింపు పొంది కూడా భర్తమీద కోపాన్ని, ఆక్రోశాన్ని తమమీద మళ్లించుకుని ప్రతిఏటా వందలాది, వేలాది మంది విహాహిత స్త్రీలు లోకంలోంచే వెళ్లిపోవడం కంటే మించిన అన్యాయం మరొకటి ఉందా.. మేల్ పిగ్ అనే ధూర్తుడు లేకున్నా ఏదైనా లక్ష్యం పెట్టుకుని జీవించవచ్చు అనే చైతన్యంవైపు మన దేశ మహిళలు ఎందుకు పయనించలేకపోతున్నారు? అసోం నటి, గాయని బిదిషా బెజ్బరువా ఆత్మహత్య ఉదంతం మరోసారి భారతీయ స్త్రీల ఆర్థిక స్వావలంబనమీద, నూతన సామాజిక చైతన్యం మీద దృష్టి సారించాల్సిన అవసరాన్ని ముందుకు తీసుకొచ్చింది.
 
ప్రముఖ అసోం నటి, గాయని బిదిషా బెజ్బరువా ఆత్మహత్యకు సంబంధించి తాజాగా పలు విషయాలు వెలుగుచూశాయి. ఆత్మహత్యకు ముందే బిదిషా భర్త నుంచి విడాకులు తీసుకోవాలనుకుంది. 28 ఏళ్ల బిదిషా.. నిషీత్‌ ఝాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇటీవల ముంబై వెళ్లిన నిషీత్‌ వేర్వేరు కారణాలు చెప్తూ గత పన్నెండు రోజులుగా గురుగావ్‌ రావడానికి నిరాకరించడంతో కలత చెందిన బిదిషా బలవన్మరణానికి పాల్పడిందని ఆమె తండ్రి అశ్విని బెజ్బరువా తెలిపారు. కొన్నాళ్ల కిందట ముంబై నుంచి గురుగావ్‌కు ఈ దంపతులు తమ ఉద్యోగాలను బదిలీ చేసుకున్నారు.
 
గురుగావ్‌లోని సుశాంత్‌ అపార్ట్‌మెంటులో అద్దెకు ఉంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల 'జగ్గాజాసూస్‌' సినిమాలో నటించిన బిదిషా సోమవారం సాయంత్రం తన అపార్ట్‌మెంట్‌లో ఆత్మహత్య చేసుకుంది. బిదిషాను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాడనే కారణంతో ఆమె భర్త నిషీత్‌ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బిదిషా ఆత్మహత్య చేసుకోవడానికి ఒకరోజు ముందు విడాకులు ఏర్పాటుచేయమంటూ వాట్సాప్‌లో తనకు మెసేజ్‌ పంపిందని తండ్రి తెలిపారు. 'తన వివాహం చివరి మలుపునకు చేరిందని బిదిషా చెప్పింది. ఆమెను ఒప్పించడానికి నేను ప్రయత్నించాను. వైవాహిక బంధాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నించమని కోరాను. కానీ నిషీత్‌ పట్ల తను నమ్మకం కోల్పోయిందని చెప్పింది' అని వివరించారు.
 
ఈ విషయాన్ని తాను నిషీత్‌కు చెప్పి.. వెంటనే బిదిషాను కలువాల్సిందిగా చెప్పినా అతను పట్టించుకోలేదని, మరింత సమయం కావాలని చెప్పాడని, ఇదే తన కూతురు బలవన్మరణానికి దారితీసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముంబైలో సహోద్యోగితో నిషీత్‌ వివాహేతర సంబంధాన్ని నెరుపుతున్నాడని, ఈ విషయం తన కూతురికి తెలిసిందని చెప్పారు. 
 
'బిదిషా కన్నా ముందే ఆమె అతనికి తెలుసు. గత జనవరిలో ఈ విషయం బిదిషాకు తెలిసింది. దీంతో ఆమెతో సంబంధాలన్నీ తెంపుకుంటానని మాట ఇచ్చిన నిషీత్‌.. ఆ తర్వాత కూడా కొనసాగించాడు. జనవరి వరకు అంతా బాగానే ఉంది. కానీ నిషీత్‌ వివాహేతర సంబంధం గురించి బిదిషాకు తెలియడంతో వారి మధ్య విభేదాలు వచ్చాయి. ఇదే చివరకు నా కూతురి ఆత్మహత్యకు దారితీసింది' అని ఆయన అన్నారు.