శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 డిశెంబరు 2021 (14:50 IST)

నవీ ముంబైలో భారీ అగ్నిప్రమాదం.. 40 BMW కార్లు దగ్ధం

BMW
నవీ ముంబైలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నవీ ముంబైలోని తుర్భే ఎంఐడీసీ ప్రాంతంలోని షోరూమ్ కమ్ గోడౌన్‌లో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో కనీసం 40 BMW కార్లు దగ్ధమయ్యాయి. కానీ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అగ్నిమాపక దళ అధికారి బుధవారం తెలిపారు. 
 
మంగళవారం తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో బిఎమ్‌డబ్ల్యూ కార్ల షోరూమ్‌లో మంటలు చెలరేగడంతో అక్కడ పార్క్ చేసిన కార్లు ధ్వంసమైనట్లు ఎంఐడిసి ఫైర్ సర్వీసెస్ చీఫ్ ఫైర్ ఆఫీసర్ ఆర్‌బి పాటిల్ తెలిపారు.
 
పది అగ్నిమాపక యంత్రాల ద్వారా మంగళవారం మధ్యాహ్నం 1 గంటల సమయంలో మంటలను అదుపులోకి తెచ్చామని, కనీసం 40-45 BMW కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయని వెల్లడించారు.